Share News

పోలీసులపై విశ్వాసం పెంచాలి : డీఎస్పీ

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:15 AM

న్యాయం కోసం స్టేషనకు వచ్చే ఫిర్యాదుదారుల కు పోలీసులపై విశ్వాసం పెరిగే లా పనిచేయాల ని నల్లగొండ డీ ఎస్పీ శివరాంరెడ్డి అన్నారు.

 పోలీసులపై విశ్వాసం పెంచాలి : డీఎస్పీ
శాలిగౌరారం పోలీ్‌సస్టేషనలో రికార్డులను పరిశీలిస్తున్న డీఎస్పీ శివరాంరెడ్డి

పోలీసులపై విశ్వాసం పెంచాలి : డీఎస్పీ

నార్కట్‌పల్లి, శాలిగౌరారం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): న్యాయం కోసం స్టేషనకు వచ్చే ఫిర్యాదుదారుల కు పోలీసులపై విశ్వాసం పెరిగే లా పనిచేయాల ని నల్లగొండ డీ ఎస్పీ శివరాంరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని నార్కట్‌పల్లి, శాలిగౌరారం మండలాలలోని పోలీ్‌సస్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో కర్తవ్య నిర్వహణే ముఖ్యమని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పోలీ్‌సస్టేషన్లలోని రికార్డులను, ఫైళ్లను, పరిసరాలను పరిశీలించారు. అనంత రం ఆయన పోలీస్‌ సిబ్బందితో మాట్లాడారు. పోలీసులు ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. స్టేషనకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. కేసులు త్వరితగతిన పరిష్కరించాలని, ఇసుక అక్రమ రవాణా కాకుండా చూడాల ని, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా అరికట్టాలని అన్నారు. నార్కట్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎ్‌సఐ ఆంజనేయులు, స్టేషన సిబ్బంది, శాలిగౌరారంలో జరిగిన కార్యక్రమంలో శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ సైదులు, స్టేషనసిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 01:15 AM