Share News

WhatsApp: అలర్ట్.. త్వరలో ఈ ఐఫోన్లల్లో వాట్సాప్ బంద్!

ABN , Publish Date - Dec 03 , 2024 | 11:46 AM

త్వరలో అందుబాటులోని రానున్న అప్‌డేటెడ్ వాట్సాప్ పాత ఐఫోన్ మోడళ్లల్లో పనిచేయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది మేలోపు పాత మోడళ్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

WhatsApp: అలర్ట్.. త్వరలో ఈ ఐఫోన్లల్లో వాట్సాప్ బంద్!

ఇంటర్నె్ట్ డెస్క్: వినియోగదారుల కోసం వాట్సాప్ నిత్యం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. అయితే, ఈ అధునాత ఫీచర్లు పాత ఫోన్లల్లో పనిచేయవన్న విషయం తెలిసిందే. పాత డివైజుల్లోని హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లు కొత్త అప్‌డేట్స్‌కు అనుకూలంగా ఉండకపోవడంతో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. అయితే, ఈ పరిస్థితి తలెత్తేలోపే కొత్త మోడళ్లు, ఓఎస్‌లల్లోకి మారేందుకు వాట్సాప్ వినియోగదారులకు కావాల్సినంత సమయం ఇస్తోంది (Tech News).

8000mAh Battery: వామ్మో.. స్మార్ట్ ఫోన్లల్లో ఇకపై 8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలు!


వచ్చే ఏడాది మే నుంచి అప్‌డేటెడ్ వాట్సాప్ అందుబాటులోకి రానుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇది పాత ఐఫోన్లల్లో పనిచేసే అవకాశాలు ఉండవని అంటున్నాయి. అంతేకాకుండా, యాపిల్ కూడా పాత్ ఐఓఎస్‌లకు అప్‌డేట్స్ పంపించడం నిలిపివేస్తుందట. ఫలితంగా పాత ఓఎస్‌లతో సైబర్ భద్రతా సమస్యలు పెరుగుతాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని యూజర్లు తమ ఓఎస్‌ను, కుదిరితే ఫోన్‌ను కూడా మార్చి కొత్తవి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Clocks tick faster on Moon: చంద్రుడిపై కాలానికి వేగమెక్కువ! ఎంత స్పీడో తెలిస్తే..


టెక్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఐఓఎస్ 15.1 వర్షన్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయట. దీనర్థం.. వినియోగదారులు లేటెస్ట్ మోడల్ ఐఫోన్‌కు మారాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత యాప్ ఐఓఎస్ 12 వర్షన్‌లో నడుస్తున్నప్పటికీ 2025 తరువాత వచ్చే కొత్త అప్‌డేట్ కారణంగా వాట్సాప్.. ఆ పాత మోడళ్లల్లో నిలిచిపోతాయని అంటున్నారు. పాత మోడళ్లల్లో సేవలు నిలిపివేయడం ద్వారా యాప్ పనితీరును మరింత మెరుగుపరిచే అవకాశం వాట్సాప్‌కు దక్కుతుంది.

వాస్తవానికి ఐఓఎస్ 15 ఇప్పటికే మూడు తరాల కిందటిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఐఫోన్ 13 లేదా 14కు అప్‌గ్రేడ్ కావడం శ్రేయస్కరమని చెబుతున్నారు. ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఇతర ఐఫోన్ 6 ప్లస్ మోడళ్లల్లో కొత్త వాట్సాప్ పనిచేయదని అంటున్నారు.

Pixel Laptop: త్వరలో పిక్సెల్ లాప్‌టాప్ లాంచ్ చేయనున్న గూగుల్?

For More Technology News and Telugu News

Updated Date - Dec 03 , 2024 | 11:51 AM