Share News

WhatsApp Lists: వాట్సాప్‌లో లిస్ట్స్ ఫీచర్! దీని ఉపయోగం ఏంటో తెలిస్తే..

ABN , Publish Date - Nov 03 , 2024 | 09:00 AM

వాట్సాప్‌లో పొరపాటున ఒకరికి బదులు వేరొకరికి మేసేజీలు పింపించే బాధను తప్పించేందుకు మెటా లిస్ట్స్ ఫీచర్ లాంచ్ చేసింది. దీంతో, చాట్స్‌ను వినియోగదారులు తమకు నచ్చిన అంశాల వారీగా వర్గీకరించి లిస్టులో రూపంలో దాచుకోవచ్చు. దీంతో, పొరపాట్లకు ఆస్కారం దాదాపుగా కనుమరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp Lists: వాట్సాప్‌లో లిస్ట్స్ ఫీచర్! దీని ఉపయోగం ఏంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్‌లో ఒకరికి పంపాల్సిన మెసేజ్‌ను పొరపాటున మరొకరికి పంపడం చాలా మంది చేసేదే. జరిగిన తప్పును వెంటనే గుర్తించి చాలా మంది మెసేజీలను డిలీట్ చేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ ఈ ఏడాది తొలినాళ్లల్లో చాట్ ఫిల్టర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది మరింత మందికి చేరువయ్యేలా తాజాగా లిస్ట్స్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీన్ని వినియోగిస్తే.. పొరపాటున వెరొకరికి మెసేజీలు పంపే సమస్య చాలా వరకూ పరిష్కారమైపోతుందని నిపుణులు చెబుతున్నారు (WhatsApp Lists).

ChatGPT: ఓపెన్‌ఏఐ మరో సంచలనం.. చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజెన్ విడుదల!


ఏమిటీ లిస్ట్స్ ఫీచర్!

లిస్ట్స్.. పేరుకు తగ్గట్టే ఇది మనకు నచ్చిన అంశం ఆధారంగా వాట్సాప్‌ చాట్స్‌ను వర్గీకరిస్తుంది. ఉదాహరణకు మీరు కుటుంబసభ్యుల చాట్స్‌, బంధువుల చాట్స్ వేర్వేరు గ్రూపులుగా వర్గీకరించాలనుకుంటే లిస్ట్స్‌ ఫీచర్ ఇందుకు ఉపయోగించుకోవచ్చు. దీంతో, మనకు కావాల్సిన పేర్లతో లిస్టులు తయారు చేసుకుని వాటిలో చాట్స్‌ను చేర్చొచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే లాప్ టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఫోల్డర్లు ఏర్పాటు చేయడం లాంటిదన్నమాట.


WhatsApp: వాట్సాప్‌లో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై స్టేటస్‌లో మెన్షన్స్


లిస్టులతో ఉపయోగాలు ఇవీ

వాట్సాప్ వినియోగం మరింత సులభతరం చేసేందుకు ఈ ఫీచర్ వినియోగించారు. ఉదాహరణకు, ఆఫీసు చాట్స్, ఫ్యామిలీ సభ్యులతో చాట్స్, వంటివన్నీ వేర్వేలు లిస్టులకు జత చేయొచ్చు. దీంతో, పొరపాట్లకు అవకాశాలు బాగా తగ్గిపోతాయి.

ఉదహారణకు మీ కాంటాక్టుల్లో ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు. వారిలో ఒకరు స్నేహితుడు, మరొకరు సహోద్యోగి అయ్యి ఉండొచ్చు. వీరితో జరిపిన చాట్స్‌ను వేర్వేరు లిస్టుల్లో చేర్చినప్పుడు తికమక లేకుండా మెసేజీలు పంపుకోవచ్చు. పొరపాట్లు జరిగే అవకాశాలు దాదాపుగా కనుమరుగవుతాయి. ఇప్పటికే వాట్సాప్ లిస్ట్ ఫీచర్‌ను లాంచ్ చేసినా క్రమక్రమంగా ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

For More Technology News and Telugu News

Updated Date - Nov 03 , 2024 | 09:01 AM