Share News

WhatsApp: వాట్సాప్‌లో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై స్టేటస్‌లో మెన్షన్స్

ABN , Publish Date - Nov 02 , 2024 | 12:25 PM

WhatsApp Status Mention Feature: యూజర్లకు ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది వాట్సాప్. సరికొత్త అప్డేట్స్ ఇస్తూ యాప్ క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. తాజాగా మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.

WhatsApp: వాట్సాప్‌లో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై స్టేటస్‌లో మెన్షన్స్

WhatsApp: యూజర్లకు ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది వాట్సాప్. సరికొత్త అప్డేట్స్ ఇస్తూ యాప్ క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. తాజాగా మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చిందీ మెసేజింగ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్. గత కొన్నాళ్లుగా మెన్షన్ ఫీచర్‌ను యాడ్ చేయాలని చూస్తోంది. ఎట్టకేలకు దాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్‌లోనూ వచ్చేయడంతో వినియోగదారులు ఎగిరి గంతేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేటస్ మెన్షన్ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఉపయోగాలివే..

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అప్‌లోడ్ చేసేటప్పుడు మెన్షన్ ఫీచర్ వాడుతుంటారు. నచ్చిన వారిని ‘@’ సాయంతో ట్యాగ్ చేస్తుంటారు. అలా ట్యాగ్ చేసిన వ్యక్తులకు మనం స్టోరీ పెట్టినట్లు నోటిఫికేషన్ అందుతుంది. దీంతో వాళ్లు మన స్టోరీని చూస్తారు. అలాంటి సదుపాయాన్నే ఇప్పుడు వాట్సాప్‌లోకి తీసుకొచ్చారు. ఇక మీదట వాట్సాప్‌లో స్టేటస్ పెట్టే టైమ్‌లో కాంటాక్ట్‌లో నచ్చిన వారిని ట్యాగ్ చేయొచ్చు.


ఎలా వాడాలంటే..

వాట్సాప్‌లో స్టేటస్ అప్‌లోడ్ చేసే సమయంలో యాడ్ క్యాప్షన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానికి కుడివైపున ‘@’ ఐకాన్ దర్శనమిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే వాట్సాప్‌లోని అన్ని కాంటాక్ట్స్ కనిపిస్తాయి. అందులో నచ్చిన వ్యక్తుల్ని మెన్షన్ చేయొచ్చు. అలా మెన్షన్ చేసిన వారికి స్టేటస్‌కు సంబంధించిన నోటిఫికేషన్ అందుతుంది. అయితే ఇన్‌స్టా తరహాలో ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు మాత్రం అందరికీ కనిపించదు. ఈ విషయాన్ని ఇప్పటికే వాట్సాప్ ప్రకటించింది. యూజర్ల సీక్రెసీ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మెసేజింగ్ యాప్ ఈ జాగ్రత్తలు తీసుకుంది.


Also Read:

గూగుల్ నుంచి కీలక అప్‌డేట్.. వీరికి మరింత లాభం..

స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...

ఓపెన్‌ఏఐ మరో సంచలనం.. చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజెన్ విడుదల!

For More Technology News And Telugu News

Updated Date - Nov 02 , 2024 | 12:41 PM