Share News

Youtube: యూట్యూబ్‌ డౌన్.. గగ్గోలు పెట్టిన నెటిజన్స్.. అసలేమైందంటే?

ABN , Publish Date - Jul 22 , 2024 | 05:40 PM

యూట్యూబ్.. ఇది కాలక్షేపం కోసమే కాదు, ఎందరికో జీవనాధారం కూడా! కొన్ని లక్షల మంది దీనిపై ఆధారపడి తమ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటిది ఇది సోమవారం మధ్యాహ్నం సమయంలో..

Youtube: యూట్యూబ్‌ డౌన్.. గగ్గోలు పెట్టిన నెటిజన్స్.. అసలేమైందంటే?
Youtube Down

యూట్యూబ్ (Youtube).. ఇది కాలక్షేపం కోసమే కాదు, ఎందరికో జీవనాధారం కూడా! కొన్ని లక్షల మంది దీనిపై ఆధారపడి తమ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటిది ఇది సోమవారం మధ్యాహ్నం సమయంలో యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. దాదాపు ప్రతిఒక్కరి గుండె పగిలినంత పని చేసింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో.. యూట్యూబ్ డౌన్ అయ్యింది. యాప్, వెబ్‌సైట్‌లలో అంతరాయం ఏర్పడింది. దీంతో.. యూజర్లు సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెట్టారు. ముఖ్యంగా.. వీడియోలు అప్‌లోడ్ అవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్ స్టూడియోలోనూ (Youtube Studio) ఇదే సమస్య ఉందని కొందరు పేర్కొన్నారు.


డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాంకేతిక సమస్య కారణంగా యూట్యూబ్ డౌన్ అయ్యింది. అయితే.. ఈ అంతరాయానికి గల కారణాలు ఏంటనేవి వెలుగులోకి రాలేదు. మరోవైపు.. యూట్యూబ్ దీనిపై వెంటనే స్పందించింది. తాము ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది. కేవలం వీడియోల అప్‌లోడింగ్‌ విషయంలోనే ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి.. ఇది చిన్నపాటి సమస్యే అయ్యుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇలా యూట్యూబ్ డౌన్ అవ్వడం వల్ల.. దేశంలో కొన్ని చోట్ల స్ట్రీమింగ్‌పై ప్రభావం ఏర్పడింది. హైదరాబాద్‌తో పాటు కోల్‌కత్తా, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, పుణే వంటి నగరాల్లో ఈ సమస్య తలెత్తినట్టు రిపోర్ట్‌లు వెల్లడించాయి.


ఇదిలావుండగా.. మైక్రోసాఫ్ట్‌లో టెక్నికల్ గ్లిచ్‌ కారణంగా టెక్ ప్రపంచం స్థంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రైవేటు కంపెనీలు, విమానయాన సంస్థలతో పాటు కొన్ని సర్వీసులు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడా సమస్య తీరిపోయిందని అనుకునేలోపే యూట్యూబ్ సర్వర్ డౌన్ అవ్వడంతో.. సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. చాలామంది అసహనంతో పోస్టులు పెడుతున్నారు. ఇదే టైంలో #YoutubeDown అనే హ్యాష్‌ట్యాగ్ కూడా నెట్టింట్లో ట్రెండ్ అయ్యింది.

Read Latest Technology News and Telugu News

Updated Date - Jul 22 , 2024 | 05:40 PM