Share News

సాగుకు 12 గంటల కరెంట్‌ చాలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:30 AM

వ్యవసాయ సాగుకు 12 గంటల విద్యుత చాలంటూ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాలకవీడు సబ్‌స్టేషన వద్ద ధర్నా చేశారు.

సాగుకు 12 గంటల కరెంట్‌ చాలు

పాలకవీడు, జనవరి 16 : వ్యవసాయ సాగుకు 12 గంటల విద్యుత చాలంటూ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాలకవీడు సబ్‌స్టేషన వద్ద ధర్నా చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సబ్‌స్టేషన ఎదుట జానపహాడ్‌, కల్మెటతండా, చెర్వుతండాలకు చెందిన ప్రజలు ధర్నా చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరాయంగా 18 గంటలు విద్యుత సరఫ రా చేయడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, 12 గంటలు మాత్రమే కరెంట్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లల్లో తాగునీటికి నీరు దొరకడం లేదన్నారు. 12 గంటలకు విద్యుత సరఫరాను కుదించాలని విజ్ఞప్తి చేశారు. అరగంటకు పైగా ఆందోళన చేశారు. విద్యుత శాఖకు సంబంధించిన అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఆందోళన విరమించారు.

Updated Date - Jan 17 , 2024 | 12:30 AM