Share News

144 సెక్షన్‌ కొనసాగింపు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:31 PM

మొయినాబాద్‌ మండలం చిలుకూరులో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌లో 134లో ఓ ప్రవాస భారతీయుడికి పట్టా భూమి ఉంది.

144 సెక్షన్‌ కొనసాగింపు
చిలుకూరు బాలాజీ ఆలయ కమాన్‌ వద్ద పహారా కాస్తున్న పోలీసులు

మత ఘర్షణలు తలెత్తకుండా చిలుకూరులో పోలీసుల పహారా

మొయినాబాద్‌ రూరల్‌, జూలై 26 : మొయినాబాద్‌ మండలం చిలుకూరులో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌లో 134లో ఓ ప్రవాస భారతీయుడికి పట్టా భూమి ఉంది. దాని పక్కనే మరో సర్వే నంబర్‌ 133లో వక్ఫ్‌బోర్డుకు చెందిన పురాతన స్థలం, ఓ కట్టడం ఉంది. అయితే, ఓ వర్గానికి చెందిన స్థలంలో నిర్మాణం తొలగించడంపై రెండు వర్గాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మతపరమైన వివాదాలకు దారితీయకుండా సైబరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ రెండు వర్గాలవారికి నచ్చజెప్పి.. ఎవరినీ అక్కడికి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వక్ఫ్‌బోర్డు స్థలం వద్దకు వెళ్లకుండా ఉండేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. హిమాయత్‌ నగర్‌ చౌరస్తా, చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. పురాతణ కట్టడం వద్ద పోలీసులు పహారా కొనసాగుతోంది. బాలాజీ దేవాలయానికి వచ్చే భక్తులను సైతం వివరాలు అడిగిన తర్వాతనే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నెల 30 వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని మొయినాబాద్‌ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కావడంతో ఓ వర్గం వారు ప్రార్థనలు చేసిన తరువాత ఎటువంటి ఘటనలూ చోటు చేసుకోకుండా గట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 26 , 2024 | 11:32 PM