15 రోజులు.. 200 ట్రాక్టర్ బ్యాటరీల చోరీ
ABN , Publish Date - Dec 07 , 2024 | 01:08 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, సాగర్ నియోజకవర్గాల్లో బ్యాటరీ దొంగలు హడలెత్తిస్తున్నారు. పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో నిలిపిఉన్న ట్రాక్టర్ల బ్యాటరీలను చాకచక్యంగా ఎత్తుకెళ్తున్నారు. ప్రధానంగా పంటసాగు సమయంలో దుక్కి మళ్లలో నిలిపిన ట్రాక్టర్లు స్టార్ట్ కాకపోవడంతో పరుపరుగున వెళ్లి కొత్త బ్యాటరీలను కొని తెచ్చుకొని వ్యవసాయ పనులు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతూ తప్పించుక తిరు గు తున్నారు. - (ఆంధ్రజ్యోతి,మిర్యాలగూడ అర్బన్ )
రాగితీగ కోసం వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కేబుళ్లు కాజేస్తున్నారు. వరుసగా జరు గుతున్న చోరీలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గుర వుతున్నారు. 15 రోజులుగా సాగర్ ఆయకట్టులో యాస ంగి సాగు పనులు ఊపందుకుంటున్నాయి. వరి నాట్లు వేసేందుకు రైతాంగం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా బోరుబావులు, సాగర్ ప్రాజెక్టు నీటిలభ్యత ఆధారంగా దుక్కులు చదును చేసుకునేందుకు ట్రాక్ట ర్లను ఉపయోగిస్తున్నారు. రోజంతా దుక్కులు దున్ని సాయంత్రం వేళలో మిగిలిన పని కోసం పొలాల్లోనే ట్రాక్టర్లను నిలిపి ఇంటికి వస్తున్నారు. దీన్ని పసిగట్టి దొంగల ముఠా బ్యాటరీలను కాజేస్తోంది. కొందరు వ్య క్తులు పగటి వేళలో రెక్కీ పెట్టి రాత్రి వేళలో చోరీలకు పాల్పడుతున్నారు.
దొంగల ముఠా హల్‌చల్
గత నెలలో మిర్యాలగూడ మండలం పచ్చారుగడ్డలో ఓ రైతు తనపొలంలో కొంతభాగం పంటనూర్పిడి చేసి ధాన్యాన్ని ట్రాక్టర్‌లో నింపి అక్కడే నిలిపి ఇంటికిరాగా, ధాన్యాన్ని కాజేశారు. ఇటీవల వేములపల్లి, మిర్యా లగూ డ, మాడ్గులపల్లి మండలాల పరిధిలో కొందరు రైతులు పొలాన్ని దమ్ముచేయించి అక్కడే నిలిపిన ట్రాక్టర్ల బ్యాటరీలను కాజేశారు. త్రిపురారం, నిడమనూరు, పెద్ద వూర మండలాల్లో బ్యాటరీ దొంగల సంచారం మరిం తగా పెరిగింది. పక్షం రోజుల వ్యవధిలో ఈ ప్రాం తాల్లో సుమారు 200 పైచిలుకు ట్రాక్టర్లకు చెందిన బ్యాటరీలు చోరీకి గురికావడం గమనార్హం. సాగుకు సమాయత్తమయ్యే కీలక దశలో బ్యాటరీలు చోరీకి గురవుతున్న నేపథ్యంలో కొత్త బ్యాట రీలను తెచ్చు కునేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. నాణ్యత గల కంపెనీకి చెందిన కొత్తబ్యాటరీ కొనుగోలు చేయాలంటే రూ. 7 వేలవరకు ఖర్చవుతోంది. కానీ దొం గల ముఠా కాజేసిన బ్యాటరీలను రహస్యంగా డంప్ చేసి రాత్రి వేళలో హైదరాబాద్‌కు తరలించి ఒక్కో బ్యాటరీని రూ. వెయ్యి లెక్కన స్ర్కాప్ కింద విక్రయించి తమ జల్సా లు తీర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా పాత ఇనుప దుకాణం నిర్వాహకులతో పరిచయం ఉన్న వ్య క్తులు చోరీ చేసిన సొత్తును చౌకగా విక్రయించి తమ చిల్లర అవసరాలు తీర్చుకుంటున్నట్లుగా పలు వురు బాధితులు వాపోతున్నారు.