Exgratia: హోంగార్డు కుటుంబానికి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా
ABN , Publish Date - Aug 24 , 2024 | 04:07 AM
ఎన్నికల విధుల్లో అనారోగ్యంపాలై మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా సొమ్మును విడుదల చేసింది
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో అనారోగ్యంపాలై మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా సొమ్మును విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డు పని చేస్తున్న పి.అనంతయ్య 2023 సంవత్సరం నవంబరులో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం డిప్యూటేషన్‌పై వెళ్లారు. సంగఖేడా పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తూ జబ్బుపడ్డారు. అనంతరం నవంబరు 28న మృతి చెందారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలంటూ రాష్ట్ర హోంశాఖ ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం ఈ సొమ్మును విడుదల చేసింది.