Share News

శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Nov 20 , 2024 | 06:05 AM

శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తుల కోసం 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు

డిసెంబరు 6 నుంచి జనవరి 1 వరకు అందుబాటులోకి

నేటి నుంచి అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తుల కోసం 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబరు 6వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు. హైదరాబాద్‌(మౌలాలి) నుంచి కొల్లాంకు డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో, మచిలీపట్నం నుంచి కొల్లాంకు డిసెంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేకరైళ్లు నడుస్తాయని వెల్లడించారు. అలాగే తిరుగు ప్రయాణంలో కొల్లాం నుంచి మౌలాలికి డిసెంబరు 8, 15, 22, 29 తేదీల్లో, కొల్లాం నుంచి మచిలీపట్నంకు డిసెంబరు 4, 11, 18, 25, జనవరి ఒకటవ తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ రైళ్లకు అడ్వాన్స్‌ బుకింగ్‌ బుధవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

Updated Date - Nov 20 , 2024 | 06:06 AM