Share News

బాల్క సుమన్‌పై కేసు నమోదు

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:14 AM

సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదైంది. బాల్క సుమన్‌పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ నాయకుడు పూదరి తిరుపతి నేతృత్వంలో సోమవారం రాత్రి మంచిర్యాల పోలీస్‌

బాల్క సుమన్‌పై కేసు నమోదు

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్‌స్టేషన్లలో కాంగ్రెస్‌ ఫిర్యాదులు

ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు: వివేక్‌

స్థాయి మరిచి మాట్లాడుతున్నడు: సంపత్‌

తన్ని తరిమే పరిస్థితి తెచ్చుకోవద్దు: అద్దంకి

గుండు కొట్టి ఊరేగిస్తాం: దయాకర్‌ గౌడ్‌

దిల్‌సుఖ్‌నగర్‌/మంచిర్యాల/దండేపల్లి/హైదరాబాద్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదైంది. బాల్క సుమన్‌పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ నాయకుడు పూదరి తిరుపతి నేతృత్వంలో సోమవారం రాత్రి మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన పోలీసులు.. బాల్క సుమన్‌పై 294-బి, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లోనూ రెడ్డి సంఘం కన్వీనర్‌ బద్దూరి వెంకటేశ్వర్‌రెడ్డి ఆయనపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బాల్క సుమన్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. సుమన్‌ సంస్కారం లేకుండా మాట్లాడారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ధ్వజమెత్తారు. కేటీఆర్‌.. తన వెంట తిరిగే కుక్కను సీఎంపై ఉసిగొల్పాడని మండిపడ్డారు. బీఆర్‌ఎ్‌సను ప్రజలు ఇప్పటికే మడతపెట్టారన్నారు. ఓటమి మంచికేనంటూ కేటీఆర్‌ మాట్లాడుతున్నారని, ఆయనకు జీవితకాలం మంచే జరగాలని ఆ దేవుడుని కోరుకుంటున్నానన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఓటమి ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని, తన్ని తరిమేసే పరిస్థితి తెచ్చుకుంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ అన్నారు. ఇలాంటి చిల్లరగాళ్ల మాటలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు.

కేటీఆర్‌ అండ్‌ టీమ్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. బాల్క సుమన్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని.. రేవంత్‌రెడ్డిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుండు కొట్టించి గాడిదపై ఊరేగిస్తామని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ హెచ్చరించారు. అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీచుడు బాల్క సుమన్‌ అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారుగొండ వెంకటేష్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతా చారి, వేణుగోపాల్‌రెడ్డి చావుకు ఆయనే కారణమన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కైలాశ్‌ నేత మాట్లాడుతూ సీఎం రేవంత్‌కు బాల్క సుమన్‌ చెప్పు చూపిస్తే.. తెలంగాణ ప్రజలు ఆయన్ను బట్టలూడదీసి కొడతారన్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ సూచించారు. దిగజారి మాట్లాడటం సరైందికాదని హితవు పలికారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో బాల్క సుమన్‌ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి, దహనం చేశారు. అలాగే, చెన్నూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులు చెప్పులదండ వేసి నిరసన తెలిపారు.

Updated Date - Feb 06 , 2024 | 04:14 AM