అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలి
ABN , Publish Date - Jan 19 , 2024 | 12:39 AM
: గ్రామ, మండల, జిల్లా అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.
సూర్యాపేట(కలెక్టరేట్), జనవరి 18 : గ్రామ, మండల, జిల్లా అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రటరీలతో వెబ్ ఎక్స్ ద్వారా నిర్వహించిన కాన్ఫరెన్సలో అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలసి మాట్లాడారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కేంద్ర, రాష్ట్ర శాఖల ద్వారా వచ్చిన వివిధ పథకాలకు వచ్చే నిధుల సమాచారంతో సమగ్రంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అందులో రెండు ముఖ్యమైన పథకాలకు ప్రాధాన్యమిచ్చి 25శాతం నిధులను కేటాయిస్తార న్నారు. అందుకోసం ఈ నెల 20న మండల స్పెసల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఎంపీడీవో, ఎంపీవో, మండలస్థాయి అధికారులు, గ్రామకార్యదర్శులతో మండల పరిషత కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. సర్పంచల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన మొదటి గ్రామసభ, ఈ నెల 25వ తేదీన రెండో గ్రామసభను నిర్వహించాలన్నారు. గ్రామస్రమ్‌స్వరాజ్ పోర్టల్‌లో ఈ నెల 27వ తేదీ వరకు వివరాలను పొందుపర్చాలన్నారు. డీఆర్‌డీవో పీడీ కిరణ్‌కుమార్, జడ్పీ సీఈవో సురేష్, డీపీవో యాదయ్య పాల్గొన్నారు.
స్పెషల్ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
నూతన ఓటర్ల నమోదు, ఓటరు కార్డుల్లో మార్పుల కోసం ఈ నెల 20, 21వ తేదీల్లో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించినందున బూతలెవల్ అధికారులు ఈ నెల 20, 21వ తేదీల్లో ఆయా పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత ఫారాలతో అందుబాటులో ఉండాలన్నారు. ఓటరు జాబితాలో పేరు, చిరునామా, తదితర సవరణల అవకాశం కల్పిస్తున్నారని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఓటరు దినోత్సవం సందర్భంగా ముగ్గుల పోటీలు
ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 22, 23 తేదీల్లో మండల స్థాయిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గాల వారీగా బీఎల్‌వోలు ఉద్యోగులకు కబడ్డీ పోటీలను నిర్వహించాలన్నారు. విజేతలకు ప్రశంసాపత్రాలతో పాటు బహుమతుల కింద నగదు అందజేస్తామన్నారు.
జానపహాడ్ ఉర్సు ఆహ్వాన పత్రిక అందజేత
పాలకవీడు మండలంలోని జానపహాడ్ గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు నిర్వహించే సైదులు దర్గా ఉర్సు ఉత్సవాల ఆహ్వానపత్రికను దర్గా ముజావర్ ఎస్‌డీ జానీ, కమిటీ సభ్యులు కలెక్టర్ వెంకటరావుకు అందజేశారు.