వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:40 AM
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అ త్యంత ప్రాధాన్యతనిస్తుందని మునిసిపల్ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
చిట్యాల, డిసెంబరు25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అ త్యంత ప్రాధాన్యతనిస్తుందని మునిసిపల్ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డి, ఉదయసముద్రం ప్రాజెక్టులకు నిధుల విడుదల చేయడంతో బు ధవారం చిట్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, రైతులు ముఖ్యమంత్రి రేవంతరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడంతో పాటు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటుందని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్‌పర్సన నర్రా వినోద, వైస్ చైర్మన ఐతరాజు యాదయ్య, జడల చినమల్లయ్య, ఎద్దులపురి కృష్ణ, కాటం వెంకటేశం, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.