ప్రభుత్వ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:32 AM
ప్రభుత్వ వాహనం వెనుకనుంచి బైక్‌ను ఢీ కొని వ్యక్తి మృతిచెందాడు.
గరిడేపల్లి, సెప్టెంబరు 15: ప్రభుత్వ వాహనం వెనుకనుంచి బైక్‌ను ఢీ కొని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం సూర్యాపేట జల్లా గరిడేపల్లి మండలకేంద్రంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకట్రాం పురం గ్రామానికి చెందిన కీసరి జీడయ్య(42) మండల కేంద్రం నుంచి అబ్బిరెడ్డిగూడెం వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం 8:30 సమయంలో బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో మిర్యాలగూడెం నుంచి హుజూర్‌నగర్ వెళున్న పోలీస్ వాహనం వెనకాల నుంచి ఢీకొనడంతో జీడయ్య కింద పడి కారు ముందు దొర్లుకుంటూ కొంత దూరం వెళ్లాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్‌చేసి క్షతగాత్రుడిని మిర్యాలగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెం దాడు. మిర్యాలగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుంటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రభుత్వ వాహనమైతే ఎవరినైనా చంపేస్తారా?
ప్రమాదానికి కారణమైన ప్రభుత్వ వాహనం కావడంతో మృతుడి కుటుంబానికి న్యాయం చేయలని బాధితుడి కుటుంబసభ్యులు, బంధువులు సాయంత్రం ఐదు గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో కోదాడ, మిర్యాలగూడెం ప్రధాన రహదారిపై ఉంచి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు చేశారు. మొదట పోలీసులు, గ్రామ నాయకులు ఎంత చెప్పినా బాధితులు వినలేదు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ప్రమాదానికి గురైన వాహనం నంబర్ ప్లేట్ తొలగించారని, డ్రైవర్‌ను ఎక్కడకు పంపించారని, ప్రభుత్వ వాహనం అయితే ఎవరినైనా చంపుతారా అని పోలీసులతో వాగ్వా దానికి దిగారు. సమయంలో మం డల నాయకులు త్రిపురం అంజన్‌రెడ్డి, పయి డిమర్రి రంగనాధ్, పెండెం శ్రీనివాస్‌గౌడ్‌లు వెంకట్రాంపురం గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, వారు వినిపించుకోకపోవడంతో, అసహనానికి గురైన పోలీసులు మృతదేహం ఉన్న వాహనాన్ని తీసేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హుజూర్‌నగర్ సీఐ చరమం దరాజు స్పెషల్ పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. సీఐ, నాయకులు, ఎస్‌ఐ కలిసి బాధిత కుటుంబ సభ్యులను, గ్రామానికి చెందిన పెద్ద మనుషులతో మాట్లాడి బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్ప డంతో శాంతించిన బాధితులు రాస్తారోకో విరమించారు. సుమారు రెండున్నర గంటలు పాటు రాస్తారోకో నిర్వహిం చడంతో మిర్యాలగూడ, కోదాడ ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పున రుద్ధరించారు. జీడయ్య భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ. చలిగంటి నరేష్ తెలిపారు.