కర్రెగుట్ట అడవిలో పేలిన ప్రెషర్‌బాంబు
ABN , Publish Date - Jun 14 , 2024 | 03:24 AM
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గురువారం ప్రెషర్‌బాంబు పేలిన ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం డోలి గ్రామంలో కొలువైన బెడెం మల్లన్నను
మహిళ కాళ్లకు తీవ్ర గాయాలు...
వెంకటాపురం(నూగూరు), జూన్ 13: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గురువారం ప్రెషర్‌బాంబు పేలిన ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం డోలి గ్రామంలో కొలువైన బెడెం మల్లన్నను దర్శించుకునేందుకు ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం చొక్కాలకు చెందిన సుమారు వందమంది బయలుదేరారు. అటవీ మార్గంలో వెళ్తుండగా భూమిలో పాతిపెట్టి ఉన్న బాంబుపై సుజాత అనే మహిళ కాలేయడంతో అది పేలింది. ఆమె ఎడమకాలు 80 శాతం దెబ్బతింది. కుడి కాలికి కూడా తీవ్రగాయమైంది. తోటి గ్రామస్థులు సుజాతను జోలెలో మోస్తూ పాలెం వాగు ప్రాజెక్టు సమీపానికి చేర్చారు. అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలిం చారు. కాగా, ఈ నెల 3న వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో మందు పాతర పేలి జగన్నాథపురానికి చెందిన ఇల్లందుల ఏసు అనే వ్యక్తి మరణించాడు. ఆ ఘటన మరవక ముందే కర్రెగుట్టలో ప్రెషర్‌బాంబు పేలడం కలకలం రేపింది.