Share News

Yuva Vikasam : పెద్దపల్లికి సీఎం వరాలజల్లు

ABN , Publish Date - Dec 04 , 2024 | 05:53 AM

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో బుధవారం యువ వికాసం కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పరిసర ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

Yuva Vikasam : పెద్దపల్లికి సీఎం వరాలజల్లు

నేడు జిల్లా కేంద్రంలో యువ వికాసం కార్యక్రమం

రూ.500కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆమోదం

సభలో 9007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు

స్కిల్‌ వర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో ఒప్పందాలు

హైదరాబాద్‌, పెద్దపల్లి, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో బుధవారం యువ వికాసం కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పరిసర ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వరాలు జల్లు కురిపించారు. సుమారు రూ.500 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. రూ.51 కోట్ల అంచనా వ్యయంతో పెద్దపల్లిలోని 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా విస్తరించేందుకు అవసరమైన పరిపాలనా అనుమతులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. అలాగే, మంథనిలో రూ.22 కోట్ల అంచనా వ్యయంతో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణానికి, గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. పెద్దపల్లిలో నాలుగు లేన్ల బైపాస్‌ రహదారితోపాటు దాదాపు రూ.352 కోట్లతో ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు అభివృద్ధి, రూ.10 కోట్ల అంచనాతో సబ్‌ ేస్టషన్ల పనులకు ఆమోదం లభించింది. పెద్దపల్లిలో రూరల్‌, మహిళ, ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లతోపాటు ఎలిగేడుకు మరో పోలీసు స్టేషన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే, ఎలిగేడుకు ప్రత్యేక వ్యవసాయ మార్కెట్‌ కమిటీని మంజూరు చేసింది. రామగుండంలో నర్సింగ్‌ కళాశాలను ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రారంభం కానుంది.

9007 మంది ఉద్యోగ నియామక పత్రాలు

పెద్దపల్లిలో జరిగే సీఎం యువ వికాసం బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించేందుకు జిల్లా నేతలు ఏర్పాట్లు చేశారు. ఇక, సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకిస్తారు. అనంతరం, గ్రూప్‌-3, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌, సింగరేణిలో ఉద్యోగాలు సాధించిన 9,007 మందికి నియామక పత్రాలను అందిస్తారు. స్కిల్‌ యూనివర్శిటీకి సంబంధించి ఏడు ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకుంటారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Updated Date - Dec 04 , 2024 | 05:53 AM