Share News

Telangana: కరెంటు కమిషన్‌కు అజయ్‌మిశ్రా వివరణ.. ఇక మిగిలింది కేసీఆర్‌ ఒక్కరే!

ABN , Publish Date - Jun 13 , 2024 | 02:54 AM

ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌కేంద్రాల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు బుధవారం ఇంధనశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు.

Telangana: కరెంటు కమిషన్‌కు అజయ్‌మిశ్రా వివరణ.. ఇక మిగిలింది కేసీఆర్‌ ఒక్కరే!

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్ గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌కేంద్రాల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు బుధవారం ఇంధనశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. యాదాద్రి నిర్మాణం కీలకదశలో ఉన్న సమయంలో అజయ్‌మిశ్రా ఇంధనశాఖ బాధ్యతలు చూస్తుండేవారు. ఆ కారణంగానే కమిషన్‌ ఆయనకు నోటీసులు ఇవ్వగా... యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణంతో తనకెలాంటి సంబంధం లేదని, అదంతా ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయమని అజయ్‌మిశ్రా వివరణ ఇచ్చినట్లు సమాచారం. కమిషన్‌ నోటీసులు ఇచ్చిన 25 మందిలో ఇప్పటివరకూ మాజీ సీఎం కేసీఆర్‌ తప్ప అందరూ వివరణ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు కమిషన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 13 , 2024 | 02:54 AM