‘అల్ఫోర్స్’ విద్యార్థుల విజయం
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:48 AM
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని విద్యాసంస్థల ఛైర్మన్

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకుగాను టి.శృతి 468, సిహెచ్.శ్రీహిత 468, వి.ప్రణవి 468, ఎ.శశిప్రీతమ్ 468, కె.వర్షిత్ 468, ఎస్.కార్తికేయ 468, కె.సృజల్ 468, టి.వర్షిత 468, ఎం.శ్రీవర్ష 468, పి.జి.ప్రియామృత 468, కె.వర్షిణి 468, ఇ.ప్రసన్న 468, ఎం.రుత్విక 468, జి.లక్ష్మిప్రసన్న468, కె. అభిలాష్ 468 మార్కులతో రాష్ట్రస్థాయిలో అగ్రగాములుగా నిలిచారని తెలిపారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకుగాను బి.నీలిమ 438 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలిచారని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకుగాను కె. కార్తీకబాబు, టి.సాహిత్య 993 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిచారని అన్నారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకుగాను సి.హెచ్.నిఖిల్ 990, బి.అమిత 990, ఎ.శ్రీనిధి 990 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో విశిష్ఠ స్థానంలో నిలిచారని సంతోషం వ్యక్తం చేశారు.