Share News

‘ఉపాధి’ చెల్లింపులన్నీ ఆనలైన చేయాలి

ABN , Publish Date - May 02 , 2024 | 11:43 PM

ఉపాధి కూలీలకు రూ.150 కూలి కల్పించి లేబర్‌ రిపోర్ట్‌, వేతన చెల్లింపు, మెటీరియల్‌ చెల్లింపులన్నీ అనుసంధానం చేయాలని డీఆర్‌డీవో పీడీ నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు.

‘ఉపాధి’ చెల్లింపులన్నీ ఆనలైన చేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌డీవో పీడీ నాగిరెడ్డి

‘ఉపాధి’ చెల్లింపులన్నీ ఆనలైన చేయాలి

డీఆర్‌డీవో పీడీ నాగిరెడ్డి

మిర్యాలగూడరూరల్‌, మే 2: ఉపాధి కూలీలకు రూ.150 కూలి కల్పించి లేబర్‌ రిపోర్ట్‌, వేతన చెల్లింపు, మెటీరియల్‌ చెల్లింపులన్నీ అనుసంధానం చేయాలని డీఆర్‌డీవో పీడీ నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనలైన ప్రాతిపదికన లేబర్‌ రిపోర్ట్‌, వేజ్‌ పేమెంట్‌ పెరిగితే మెటీరియల్‌ పేమెంట్‌ పనులు పెంచుకోవచ్చన్నారు.రూ. 200కన్నా తక్కువ పేమెంట్‌ వస్తే ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లపై, ఏపీవో, పీఓలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోజు కూ లీ రూ.250 నుంచి రూ.300 వరకు పనులు చేయించాలన్నారు. పని ప్రదేశంలో వసతులు కల్పించడంతో పాటు వేజ్‌ సీకర్ల ఖా తా ఆధార్‌ అథెంటికేషన ఎనపీసీఏ మ్యాపింగ్‌ చేసి మస్టర్లు స మర్పించాలన్నారు. వననర్సరీలో 5500 మొక్కలను పెంచి గ్రామసభల ద్వారా ఉపాధి పనులు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శేషగిరిశర్మ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 02 , 2024 | 11:43 PM