11 కలిసి రావడం లేదా!
ABN , Publish Date - Dec 25 , 2024 | 05:05 AM
ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు 11 కలిసి రావడం లేదా..? అంటే ఔనన్నదే సమాధానం.
నంద్యాల ఘటన నుంచి తాజా కేసులో ఏ-11 వరకు సామాజిక మాధ్యమాల్లో చర్చ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు 11 కలిసి రావడం లేదా..? అంటే ఔనన్నదే సమాధానం. ఏపీ ఎన్నికల నేపథ్యంలో మే 11వ తేదీన ఆయన నంద్యాలకు వెళ్లారు. వైఎస్సార్‌సీపీ తరఫున నంద్యాల అభ్యర్థిగా పోటీ చేసిన శిల్ప రవిచంద్ర కిషోర్‌రెడ్డికి మద్దతు పలికారు. ఇది అప్పట్లో వివాదస్పదమైంది. మెగా కాంపౌండ్‌కు చెందిన అర్జున్.. జనసేన కూటమిని కాదని.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం చర్చనీయాంశమైంది. డిసెంబరు 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన రేవతి మృతిని నిమ్స్ వైద్యులు అదే రోజు 11 గంటల సమయంలో నిర్ధారించినట్టు సమాచారం. ఈ కేసులో అర్జున్ ఏ-11గా ఉన్నారు. ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరిగినా.. 11 నంబర్ అర్జున్‌కు కలిసి రావడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.