అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలి
ABN , Publish Date - Dec 23 , 2024 | 01:05 AM
భారత రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలు చేయడం అహంకారానికి నిదర్శనమని, ఆయనను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పి ంచాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ డిమాండ్ చేశారు.
పెద్దఅడిశర్లపల్లి, డిసెంబరు 22, (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలు చేయడం అహంకారానికి నిదర్శనమని, ఆయనను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పి ంచాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ డిమాండ్ చేశారు. మండలంలోని పుట్టంగండి గ్రామంలో ఆదివారం జరిగిన సంఘం వర్క్‌షాపులో ఆమె మాట్లాడారు. రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలోనే రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అమిత్‌షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. పోలేబోయిన వరలక్ష్మీ అధ్య క్షతన జరిగిన సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, నాయకులు కొండా అనురాధ, జిట్టా సరోజ, పద్మభూతం, అరుణ, నాగమణి, ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.