Share News

మద్యం సరఫరా చేసే వారిపై చర్యలేవీ?

ABN , Publish Date - Jan 10 , 2024 | 12:01 AM

గ్రామాల్లో బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తున్న మద్యం దుకాణ యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఎక్సైజ్‌ ఎస్‌ఐ గురువయ్యను ప్రశ్నించారు.

మద్యం సరఫరా చేసే వారిపై చర్యలేవీ?
ఎక్సైజ్‌ ఎస్‌ఐ గురువయ్యను ప్రశ్నిస్తున్న జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం

చండూరు, జనవరి 9 : గ్రామాల్లో బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తున్న మద్యం దుకాణ యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఎక్సైజ్‌ ఎస్‌ఐ గురువయ్యను ప్రశ్నించారు. మంగళవారం మండల పరిషత కార్యాలయంలో ఎంపీపీ పల్లె కల్యాణి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు శాఖలపై ఆయన సమీక్షించారు. గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్‌ సమస్యను సాకుగా చూపి భూసమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయడం లేదన్నారు. తీరు మార్చుకోవాలని రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. ఎంపీపీ కల్యాణి మాట్లాడుతూ కొంతమంది అధికారుల అలసత్వంతో గ్రామాల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయని అన్నారు. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధి పనుల్లో చేపట్టడం లేదని తేరట్‌పల్లి ఎంపీటీసీ గొరిగె సత్తయ్య, గట్టుప్పల పశువైద్యాధికారి బాలకృష్ణ విధులకు సకాలంలో రావడం లేదని సభ్యులు ప్రశ్నించారు. ట్రాన్సకో ఏఈ శ్రీనివాసరావు గైర్హాజరుపై బంగారిగడ్డ సర్పంచ పల్లె వెంకటయ్య నిలదీశారు. ఇనచార్జిని అనే సాకుతో ఎంఈవో పట్టించుకోవడం లేదని ఎంపీటీసి పల్లె వెంకన్న ఆరోపించారు. సమావేశంలో ఎంపీడీవో యాకూబ్‌నాయక్‌, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డితో పాటు పలుశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 12:01 AM