రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల మంజూరుకు విజ్ఞప్తి
ABN , Publish Date - Jan 25 , 2024 | 04:26 AM
రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ ట్రెసా ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ ట్రెసా ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేసింది. రెవెన్యూ ఉద్యోగుల వెహికల్ , మెడికల్, జీపీఎఫ్, సప్లిమెంటరీ శాలరీ బిల్లులతోపాటు వీఆర్‌ఏల వేతనాల బిల్లులు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) కోరింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలు, డివిజన్ల ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ట్రెసా ప్రతినిధులు కోరారు. అలాగే రెవెన్యూ సేవలు ప్రజలకు అందించడంలో ఇబ్బందులు కలుగుతున్నాయని క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిని పెంచాలని సూచించారు. దీనిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి, తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మరోమారు ట్రెసా ప్రతినిధులతో అన్ని విషయాలు కూలంకుశంగా చర్చించి రెవెన్యూ సిబ్బంది పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.