ఆశా కార్యకర్తలకు ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి : సీఐటీయూ
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:41 AM
భువనగిరి గంజ్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18వేల వేతనం ప్రకటించాలని ఆశావర్కర్స్ యూనియన రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆశావర్కర్ల యూనియన సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు జాతా ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా భువనగిరిలో రైల్వేస్టేషన నుంచి సీఐటీయూ జిల్లా కార్యాలయం వరకు పాదయాత్రగా చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జయలక్ష్మి మాటా ్లడుతూ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆశా వర్కర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. పనిభారంతో ఇబ్బందులు గురువుతున్నారని, గతంలో టీబీ, పోలి యో సర్వేలు చేసిన పారితోషికాలు నేటికి ఇవ్వలేదన్నారు. పెండింగ్ ఉన్న బిల్లులు పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిస్కరించాలని లేకుంటే మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో డిసెంబరు 31న ఇందిరా పార్కువద్ద నిర్వహించనున్న సభకు వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంల రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు సాధన, సహయ కార్యదర్శి సునీత, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేషం, ఆశా యూనియన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటమ్మ లలిత, బోడ భాగ్య, సంతోష, జ్యోతి, మాయకృష్ణ, బాల్‌రాజు