Share News

అటవీ భూముల ఆక్రమణకు యత్నం

ABN , Publish Date - Dec 23 , 2024 | 01:56 AM

మండలంలోని ఆత్మకూర్‌ గ్రామ శివా రులోని అటవీ భూముల ఆక్రమణకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు.

అటవీ భూముల ఆక్రమణకు యత్నం
ఆత్మకూర్‌ గ్రామ శివారులోని అటవీ భూమిలో ఆందళోన చేస్తున్న గ్రామస్థులు

- అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఆత్మకూర్‌ గ్రామస్థులు

మెట్‌పల్లి రూరల్‌, డిసెంబర్‌, 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఆత్మకూర్‌ గ్రామ శివా రులోని అటవీ భూముల ఆక్రమణకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు. గ్రామస్థులు చదును చేసిన అటవీ భూమిని అధి కారుల దృష్టికి తీసుకెళ్లి అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. అటవీ భూమి చుట్టున్న పాటిమీదతండా గ్రామానికి సంబంధించిన వారితో పాటు ఇతర గ్రామస్థులు వందల ఎక రాల భూమిని కబ్జా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని గ్రామస్థులు మండి పడ్డారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలా నికి చేరుకున్నారు. కొన్ని రోజుల నుంచి తాము ఫిర్యాదులు చేసినా ఎందుకు చర్యలు తీ సుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ కొన్ని రోజుల నుంచి సుమారు వంద ఎకాల వరకు అటవీ భూమిలో ఉన్న చెట్లను తొలగించి సాగుకు చదును చేస్తున్నారని తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళోన బాట పట్టామన్నారు. అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా కలెక్టర్‌ ప్రత్యేక చ ర్యలు తీసుకుని అడవులను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృ ష్టికి తీసుకెళ్లి అక్రమానికి గురికాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపడంతో అక్కడి నుంచి తిరిగి వెళ్లారు.

Updated Date - Dec 23 , 2024 | 01:56 AM