Share News

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : సీఐ

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:00 AM

సమాజంలో యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండాలని చండూరు పోలీస్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ (సీఐ) వెంకటయ్య అన్నారు.

 మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : సీఐ
సమావేశంలో మాట్లాడుతున్న సీఐ వెంకటయ్య

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : సీఐ

మునుగోడు, జూలై 26: సమాజంలో యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండాలని చండూరు పోలీస్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ (సీఐ) వెంకటయ్య అన్నారు. మునుగోడులో పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘మాదకద్రవ్యాల నిర్మూలన’ అనే అంశంపై వి ద్యార్థులు, యువతకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆ యన హాజరై మాట్లాడారు. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పి ల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు ఎంతో కష్టపడి చదివిస్తుంటే యువత మాత్రం మత్తుకు బాసినగా మారి వారి జీవితాలను నాశనం చేసకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ మత్తు లో వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడటం, డ్రగ్స్‌ విక్రయాల కు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరిం చారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సీహెచ. వెంకటేశ్వర్లు, ఏఎ్‌సఐ అం జయ్య, పీఎనఎం జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, డీవైఎ ఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మిర్యాల భరతకుమార్‌, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:00 AM