Share News

ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:12 PM

అధిక ఆదాయాన్ని ఇచ్చి అయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ సిక్తా పట్నా యక్‌ సంబంఽధిత అధికారులకు సూచించారు.

 ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన కల్పించాలి

- నర్సరీని పరిశీలించిన కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

మరికల్‌, జూలై 26: అధిక ఆదాయాన్ని ఇచ్చి అయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ సిక్తా పట్నా యక్‌ సంబంఽధిత అధికారులకు సూచించారు. శుక్రవారం మండల పరిఽధిలో కన్మనూర్‌ గ్రామం లో రైతులు గౌని మోహన్‌రెడ్డి, గౌని వనిత సాగు చేసిన అయిల్‌ ఫెడ్‌, అయిల్‌ పామ్‌ నర్సరీ, అయిల్‌ పామ్‌ తోటను, మొక్కలను పరి శీంచారు. మొక్కల సేకరణ, నాటడంతో తీసుకో వాల్సిన జాగ్రత్తలు నీటి పారుదలతో పాటు సాగుకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. మండలంలోని రైతులకు సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరాల మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు కలెక్టర్‌ కు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలె క్టర్‌ మాట్లాడుతూ అయిల్‌ పామ్‌ పంటలు సాగు చేసి అఽధిక లాభాలు పొందాలన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహంతో ఏడాదికి ఎకరాకు రూ.4200 చెల్లిస్తుందని రైతుల సాగు చేసేందు కు ముందుకు రావాలని కోరారు. అలాగే ప్రభుత్వం రాయితీలతో కూడిన బిందు సేద్యం పరికరాలు అందజేస్తుందన్నారు. రైతులు ఆయిల్‌ పామ్‌ పంటలపై ఆసక్తి పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన, పట్టు పరిశ్రమల అఽధికారి ఆల్‌ఫె డ్‌, జిల్లా మేనేజర్‌, హర్టికల్చర్‌ ఆఫీసర్లు, సిబ్బం ది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

క్రీడల్లో రాణించాలి

ధన్వాడ: క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రా ణించి మంచి పేరు తీసుకరా వాలని కలెక్టర్‌ సిక్తా పట్నా యక్‌ అన్నారు. ధన్వాడ కస్తూ ర్బా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిను లు జా తీయస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో రాణించా రు. శుక్రవారం ధన్వా డ కస్తూర్బా పాఠశాల ను పరిశీలించి క్రీడాకారు లను అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు రెజ్లింగ్‌ పోటీలను ప్రదర్శించారు. భవిష్యత్తులో ఇంకా రాణించాలని సూచించారు. ధన్వాడ కస్తూర్బాలో రెజ్లింగ్‌ క్రీ డా అకాడమీని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను డీవైఎస్‌వో కోరారు. కార్యక్ర మంలో పద్మనందిని, వెంకటేష్‌తో పాటుగా పలువురు పాల్గొన్నారు.

జోగుళాంబ సన్నిధిలో కలెక్టర్‌

అలంపూరు : అలంపూర్‌ క్షేత్రంలోని జోగుళాం బ, బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లను కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ శుక్రవారం దర్శించుకున్నారు. అంతకు ముందు ఈవో పురేందర్‌కుమార్‌, ప్రధాన అర్చకు డు ఆనంద్‌ శర్మ వారికి సాదర స్వాగతం పలి కా రు. అనంతరం స్వామివారి ఆలయంలో గణపతి పూజ, అభిషేకం నిర్వహించారు. అమ్మ వారి ఆల యంలో అర్చన చేశారు. వేద ఆశీర్వచన మండపం లో వారికి శేష వస్త్రాలు అందించి సత్క రించారు. ఆమె వెంట ఆర్‌ఐ మాసుం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:12 PM