Share News

పోలీస్‌ కుటుంబాలకు బాసటగా భద్రత పథకం

ABN , Publish Date - Jan 22 , 2024 | 11:56 PM

పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీస్‌ భద్రత పథకం నిలిచిందని ఎస్పీ రాహుల్‌హెగ్డే బీకే అన్నారు.

పోలీస్‌ కుటుంబాలకు  బాసటగా భద్రత పథకం
పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులకు చెక్‌ అందజేస్తున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సూర్యాపేటక్రైం, జనవరి 22 : పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీస్‌ భద్రత పథకం నిలిచిందని ఎస్పీ రాహుల్‌హెగ్డే బీకే అన్నారు. సూర్యాపేట రూరల్‌ పోలీ్‌సస్టేషన హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, భద్రతా పథకం కింద మంజూరైన చెక్కును సోమవారం ఆయన కుటుంబ సభ్యులకు ఎస్పీ తన కార్యాలయంలో అందజేశారు. పోలీస్‌ సిబ్బంది సంక్షేమం కోసం పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నారు. ప్రమాదవశాత్తు సిబ్బంది మృతి చెందితే భద్రత, చేయూత, గ్రూప్‌ యాక్సిడెంటల్‌ బీమా పథకాలు ఎంతగానో మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్‌ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రాంచందర్‌గౌడ్‌, సెక్షన సూపరింటెండెంట్‌ శ్రీకాంత, ఆర్‌ఎ్‌సఐ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి

ప్రజల ఫిర్యాదులపై పోలీస్‌ అధికారులు సత్వరమే స్పందించాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే బీకే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి, మాట్లాడారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషనకు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలన్నారు.

Updated Date - Jan 22 , 2024 | 11:56 PM