రోగులతో సేవాగుణంతో మెలగాలి
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:02 AM
వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, వైద్యసిబ్బంది సేవాగుణంతో మెలగాలని, లేనిచో సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు.
రోగులతో సేవాగుణంతో మెలగాలి
డీఎంహెచవో డాక్టర్ పుట్ల శ్రీనివాస్
చిట్యాలరూరల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, వైద్యసిబ్బంది సేవాగుణంతో మెలగాలని, లేనిచో సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. చిట్యాల మండలం వెలిమినేడు పీహెచసీ, దాని పరిధిలోని ఆ రోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం గా ఆయన ఆసుపత్రిలోని సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల నిల్వలు, ల్యాబ్‌ను, ప్రసూతి గదిని పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి వైద్యాధికా రి డాక్టర్ ఉబ్బు నర్సింహ, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగుల పట్ల జాగ్రత్తలను వహించాలని సూచించారు. అనారోగ్య సమస్యలతో వచ్చే వారికి స్వాంతన కలిగేలా మాట్లాడాలని, అలా చేస్తే బాధితులు సంతోషిస్తారని అన్నారు. ప్రతి ఒ క్కరితోనూ సత్ప్రవర్తనతో మెలగాలని, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని పరిశుభ్రతను, సమయపాలనను పాటించి అంకితభావంతో పనిచేయాలని అన్నారు. లేనిచో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.