Share News

వివాదాస్పదంగా మారిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సరెండర్‌

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:34 AM

జగి త్యాల జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రా ములును వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌కు సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ రెండు రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

వివాదాస్పదంగా మారిన   ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సరెండర్‌

ఫకలెక్టర్‌ నిర్ణయాన్ని తప్పు పడుతున్న వైద్య సంఘాలు

ఫ రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో వైద్యుల నిరసన

జగిత్యాల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జగి త్యాల జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రా ములును వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌కు సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ రెండు రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. జగిత్యాలలో ఒక సీనియర్‌ వైద్యుడిపై ఆరోపణలు మోపి సరెండర్‌ చేశారని వైద్య సంఘాలు తప్పు పట్టాయి. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం డడంతో పలు ఇతర కారణాలతో సూపరింటెం డెంట్‌ రాములును హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మె డికల్‌ ఎడ్యుకేషన్‌కు సరెండర్‌ చేస్తూ ఈనెల 19వ తేదీన కలెక్టర్‌ ఎల్‌ఆర్‌ నంబరు ఏ3/1553 ఉత్త ర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్‌ రాములు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుకావడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పరిపా లనకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా వ్యవహ రించడం వంటి కారణాల వల్ల సరెండర్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారాన్ని వైద్యులు తీ వ్రంగా ఖండిస్తున్నారు.

ఫగతంలో సైతం..

ఇలాంటి సంఘటనలు గతంలో సైతం చోటు చేసుకున్నాయని వైద్య సంఘాల నేతలు అంటు న్నారు. గతంలో కొత్తగూడెం సూపరింటెండెంట్‌ ఇబ్బందులకు గురయ్యాడని, చివరికి ఆయన మర ణానికి కారణం అయిందని వైద్యులు ఆరోపిస్తున్నా రు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేసి అప్పగించిన బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహిస్తున్న వైద్య అధికారులపై కొం దరు ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు బాధాకరంగా మారుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ఫరాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల నిరసన..

ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాములు సరెండ ర్‌ వ్యవహారాన్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర సన చేపట్టింది. సంఘం పిలుపు మేరకు జగి త్యా ల జనరల్‌ ఆసుపత్రి వద్ద వైద్యులు నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 01:34 AM