Share News

ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు

ABN , Publish Date - Dec 11 , 2024 | 04:35 AM

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 31 నుంచి నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు

భద్రాచలం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 31 నుంచి నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఉత్తరద్వార దర్శనానికి టికెట్లను బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. భక్తులు జ్ట్టిఞట://ఛజ్చిఛీట్చఛీటజ్ట్ఛీఝఞజ్ఛూ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చని భద్రాద్రి దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. తెలిపారు. రూ.2వేలు, రూ.1,000, రూ.500, రూ.250 విలువ గల సెక్టార్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఉత్తరద్వార దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో కొన్న భక్తులు ఈ నెల 25 నుంచి జనవరి 10వ తేదీ తెల్లవారుజామున 5గంటల వరకు తానీషా కల్యాణ మండపం కార్యాలయంలో ఒరిజినల్‌ టికెట్లను పొందవచ్చునని ఈవో రమాదేవి సూచించారు. అలాగే, ఆలయంలో ప్రత్యక్షంగా స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకోవడానికి వీలు కాని భక్తులు ఆన్‌లైన్‌లో వీక్షించేలా దేవస్థానం టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇదే వెబ్‌సైట్‌ ద్వారా రూ.2వేలు, రూ.1,000 టికెట్లను బుధవారం ఉదయం 11గంటల నుంచి బుక్‌ చేసుకోవచ్చని రమాదేవి తెలిపారు.

Updated Date - Dec 11 , 2024 | 04:36 AM