Share News

బొత్స సందీప్‌ ఫోర్జరీ కేసు వివరాలివ్వండి

ABN , Publish Date - May 02 , 2024 | 05:24 AM

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు బొత్స సందీ్‌పపై ఉన్న ఫోర్జరీ కేసు వివరాలను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు

బొత్స సందీప్‌ ఫోర్జరీ కేసు వివరాలివ్వండి

తెలంగాణ పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఏపీ మంత్రి బొత్స కొడుకుపై పిటిషన్‌

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు బొత్స సందీ్‌పపై ఉన్న ఫోర్జరీ కేసు వివరాలను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మాచన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 422లోని 31 ఎకరాల భూములను కబ్జా చేసే ఉద్దేశంతో తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను ఫోర్జరీ చేశారని పేర్కొంటూ బొత్స సందీప్‌ సహా పలువురిపై ఫిర్యాదు నమోదైంది. ఈ కేసులో పోలీసులు బొత్స సందీప్‌ సహా ఇతరులపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని పేర్కొంటూ షాబాద్‌ మండలం పెదవేడు గ్రామానికి చెందిన బొప్పి మహేందర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సదరు ఫోర్జరీ కేసు వివరాలు సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూన్‌ 5కు వాయిదా వేసింది.

Updated Date - May 02 , 2024 | 05:24 AM