బీఆర్‌ఎస్ కారు షెడ్డుకుపోయింది..
ABN , Publish Date - Feb 25 , 2024 | 04:57 AM
బీఆర్‌ఎస్ కారు షెడ్డుకుపోయిందని, అది అట్నుంచి అటే పాత ఇనుప సామాను (స్ర్కాప్) దుకాణానికి పోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
అది అట్నుంచి అటే పాత ఇనుప సామాను దుకాణానికి
ఆరు గ్యారెంటీలతోపాటు చెప్పని హామీలూ అమలు చేస్తాం
సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా పని చేస్తున్నాం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హుజూర్‌నగర్, మేళ్లచెర్వు, ఫిబ్రవరి 24: బీఆర్‌ఎస్ కారు షెడ్డుకుపోయిందని, అది అట్నుంచి అటే పాత ఇనుప సామాను (స్ర్కాప్) దుకాణానికి పోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. షెడ్డు నుంచి కారు బయటకురాదన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నక్కగూడెంలో రూ.37కోట్లతో పునరుద్ధరించిన ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎ్‌స..బీఆర్‌ఎ్‌సగా మారిందని, అదిప్పుడు వీఆర్‌ఎ్‌సలోకి పోతుందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, లక్షల కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలతోపాటు చెప్పని హామీలు కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీమ్‌లా కలిసికట్టుగా పనిచేస్తున్నామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నల్లగొండ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.2వేల కోట్లతో పనులు చేస్తున్నామని, వాటిని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. రేవూరు-దొండపాడు-రామాపురం ఎక్స్ రోడ్డు వరకు రూ.20 కోట్లు, హుజూర్‌నగర్-యాతవాకిళ్ల వరకు రూ.20 కోట్ల నిధులు రోడ్ల నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మరాజ్యంలో ప్రజాపాలన నడుస్తుందన్నారు. హుజూర్‌నగర్-కోదాడ నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి 60 వేల మెజార్టీ ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.