రేవంత్ అల్లుడిపై ఈడీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:30 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడు జి. సత్యనారాయణ డైరెక్టర్‌గా ఉన్న మ్యాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీపై ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు
న్యూఢిల్లీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడు జి. సత్యనారాయణ డైరెక్టర్‌గా ఉన్న మ్యాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీపై ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. సంబంధిత కంపెనీలో సత్యనారాయణకు 16 లక్షల షేర్లు ఉన్నట్లు బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ ఈడీ అధికారులకు తెలిపారు. అదే కంపెనీలో మరో డైరెక్టర్‌గా అన్నం శరత్ ఉన్నారని, ఆయనకు సంబంధించిన మరో కంపెనీలో కూడా రేవంత్ అల్లుడుకి 21 లక్షల షేర్లు ఉన్నాయని ఆరోపించారు. ‘‘వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. అక్కడ ఏర్పాటు చేసే మరో ఫార్మా కంపెనీలోనూ రేవంత్ అల్లుడికి వాటా ఉన్నట్టు తెలిసింది. ఇటీవల వరంగల్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ వెళ్లడం అనుమానాలకు బలాన్నిస్తోంది. రేవంత్ అల్లుడి కుటుంబంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈడీ ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మ్యాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలి’’ అని ఫిర్యాదు చేసినట్టు క్రిశాంక్ పేర్కొన్నారు.