KTR : అయోధ్య అక్షింతలు కావు.. రేషన్ బియ్యమే
ABN , Publish Date - May 05 , 2024 | 05:32 AM
బీజేపోళ్లు ఇంటింటికి వచ్చి అక్షింతలు నెత్తిమీద చల్లుతున్నారా? అవి ఆడికెళ్లి (అయోధ్య నుంచి) రాలేదు. ఇక్కడే రేషన్ బియ్యం, పసుపు కలిపి నెత్తిమీద చల్లిపోతున్నారు.
దేవుడి పేరిట బీజేపీ నేతల రాజకీయాలు
రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయిలా పాలన
కొత్త జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమం: కేటీఆర్
రేవంత్ మాటల్లో పగ, ప్రతీకారమే
సీఎం, మంత్రులది అమర్యాదకరమైన భాష
ప్రజలు అసహ్యించుకుంటున్నారు
మీట్ ద ప్రెస్‌లో బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు
దేవుడిని అడ్డంపెట్టుకునే లంగలు బీజేపోళ్లు
దేవుడి పేరిట మేమెన్నడూ రాజకీయాలు చేయలేదు
కేసీఆర్ అభివృద్ధి చేస్తే రేవంత్‌రెడ్డి ఉల్టా చేస్తున్నాడు
కొత్త జిల్లాలను కొనసాగించకుంటే ఉద్యమం
రాష్ట్రంలో పిచ్చోడి చేతులో రాయిలా పాలన
కూటమిలో లేని పార్టీలూ ఢిల్లీని శాసించొచ్చు: కేటీఆర్
సిరిసిల్ల/హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల, మే 4 (ఆంధ్రజ్యోతి): ‘బీజేపోళ్లు ఇంటింటికి వచ్చి అక్షింతలు నెత్తిమీద చల్లుతున్నారా? అవి ఆడికెళ్లి (అయోధ్య నుంచి) రాలేదు. ఇక్కడే రేషన్ బియ్యం, పసుపు కలిపి నెత్తిమీద చల్లిపోతున్నారు. దేవుడిని అడ్డంపెట్టుకొని రాజకీయం చేసే లంగలు బీజేపోళ్లు’ అని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. మార్కెట్, లేబర్ అడ్డా, కార్మిక వాడల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ యాదగిరి గుట్టపై గుడి కట్టించారని, అయినా దేవుడి పేరు చెప్పి తామెన్నడూ రాజకీయాలు చేయలేదన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ధరలు ఇంకా పెరగడం ఖాయమన్నారు. 2014లో రూ.15 లక్షలు అకౌంట్లలో వేస్తామని చెప్పి మోసం చేసిన మోదీ, ఇప్పుడు తులం బంగారం ఇస్తానని మోసం చేసిన రేవంత్‌రెడ్డికి ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని, మంచినీళ్లకు గోస పడుతున్నారని, మరమగ్గాలు బంద్ అయ్యాయన్నారు. ఈ మార్పు బాగుందా? అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎ్‌సకు 10 నుంచి 12 ఎంపీ సీట్లు ఇస్తే కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, నాలుగున్నర నెలలుగా చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప ముఖ్యమంత్రి చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించారని పేర్కొన్నారు. కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలన్న ఒకే ఒక్క ఆలోచనలో రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని నడిపించే విధానం కనిపిస్తోందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసిందని పేర్కొన్నారు. పరిపాలనను వికేంద్రికరించడం వల్ల ప్రజలకు అధికారులు చేరువయ్యారని, సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొత్త జిల్లాలను కొనసాగించాలని, లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.
కేసీఆర్‌ను తిట్టడం పాలన కాదు
‘ఎన్‌డీఏ, ఇండియా కూటమిలలో లేని బీఆర్‌ఎస్, బిజూ జనతాదళ్, వైఎ్‌సఆర్‌సీపీ వంటి పార్టీలున్నయి. రేపు కాలం కలిసొస్తే.. ఏదైనా జరగొచ్చు.. కూటముల్లో లేని 13 పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు.. దేశ రాజధానిని శాసించొచ్చు. శాసించి ఢిల్లీని లొంగదీసుకుందామా..? యాచించి వాళ్ల వద్దకు పోదామా ఆలోచించాలి’ అని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా శనివారం కుత్బుల్లాపుర్ నియోజకవర్గంలోని షాపూర్ వద్ద నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ను తిట్డడం పాలన కాదని రేవంత్‌రెడ్డినుద్దేశించి అన్నారు.