Share News

దసరాకు సొంతూళ్లకు పయనం

ABN , Publish Date - Oct 11 , 2024 | 05:52 AM

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

దసరాకు సొంతూళ్లకు పయనం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 10 (ఆంధజ్యోతి): దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. గురువారం రాత్రి 10 గంటల వరకు వెయ్యికిపైగా ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఏపీ జిల్లాలకు తరలి వె ళ్లాయని అధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకు వీలుగా అక్టోబరు 13, 14వ తేదీల వరకు ఈ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం చార్జీలు పెంచడంపై ప్రయాణికులు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దసరా, దీపావళి పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 1,400 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ వెల్లడించారు. అక్టోబరు 1 నుంచి నవంబరు 30 వరకు వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. స్టేషన్లలో అదనపు బుకింగ్‌ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Oct 11 , 2024 | 05:52 AM