Share News

Manchiryāla- ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Jun 19 , 2024 | 10:40 PM

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు.

Manchiryāla-       ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు
మందమర్రిలో కేక్‌ కట్‌ చే స్తున్న చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు

ఏసీసీ, జూన్‌ 19: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు తూముల నరేష్‌, బ్లాక్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, హేమలత, బానేష్‌, వసుంధరల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి పార్లమెంట్‌ సేవాదల్‌ కార్యాలయంలో బుధవారం రాహుల్‌గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సేవాదల్‌ ఇన్‌చార్జీ డాక్టర్‌ నీలకంటేశ్వర్‌రావు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం రెడ్‌క్రాస్‌ ఆనంద నిలయం వృద్దుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జైనుల్‌ అబ్దీన్‌, వనజ, నాయకులు పాల్గొన్నారు.

మందమర్రి టౌన్‌: పట్టణంలోని మనో వికాస్‌ మానసిక వికలాంగుల పాఠశాలలో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా జన్మదిన కేక్‌ను చైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు కట్‌చేసి విద్యార్ధులకు స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మంద తిరుమల్‌, పైడిమల్ల నర్సింగ్‌, పాషా, దుర్గం ప్రభాకర్‌, రాయబారపు కిరణ్‌, జావిద్‌ఖాన్‌, ఎర్ర రాజు, సరిత, తదితరులు పాల్గొన్నారు. కాగా పట్టణంలోని పాత బస్టాండ్‌ ఏరియాలో ఎంపీ రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ఉపేందర్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు శ్రీనివాస్‌, లక్ష్మణ్‌లు కట్‌చేసి కార్యకర్తలకు తినిపించారు. కార్యక్రమంలో దేవి భూమయ్య, గడ్డం రిజిని, జమీల్‌, ఆసిఫ్‌, కనకం రాజు, అందుగుల శ్రీనివాస్‌, తుంగిపిండి విజయ్‌, శ్రీనివాస్‌, రాంబాబు, సత్యం, రజిత, తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: పట్టణంలో రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో బెల్లంపల్లి ఎ మ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి కేక్‌ కట్‌ చేసి నాయకులకు పంచారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాహుల్‌గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. తాండూర్‌లో ఐబీ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎండీ ఈసా, నాయకులు మురళి, రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ శంకర్‌, రత్నాకర్‌రావు, మహేందర్‌రావు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

చెన్నూరు: చెన్నూరులో రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహిం చారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు సూర్య, మండల మాజీ అధ్యక్షుడు అంకాగౌడ్‌, నాయ కులు రాకేష్‌, లక్ష్మణ్‌, సుధాకర్‌రెడ్డి, నాగరాజు, మహేష్‌, సుల్తాన్‌, కమలాకర్‌,సుమంత్‌,ప్రసాద్‌, బానేష్‌, రవి, శ్రావణ్‌, మధు, షాహీర్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

జన్నారం: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పసివుల్లా, పట్టణాధ్యక్షుడు రమేష్‌, నాయకులు రియాజుద్దీన్‌, ఇందయ్య, లక్ష్మణ్‌,పద్మారావు, సాధుపాషా, రజాక్‌, బాపన్న, భూమన్న, గంగయ్య, బుచ్చిబాబు,రాజేశం, కలీం, అజార్‌, రసూల్‌, అజ్మత్‌, ప్రవీణ్‌ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2024 | 10:40 PM