Share News

అలైన్‌మెంట్‌ను మార్పించండి

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:16 PM

కల్వకుర్తి-నంద్యాల వెళ్లే 167కే నూతన జాతీయ రహదారికి సంబంధించిన భూ నిర్వా సితులు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు.

అలైన్‌మెంట్‌ను మార్పించండి
ఎస్‌ఐ గురుస్వామికి వినతిపత్రం ఇస్తున్న భూనిర్వాసితులు

- బైపాస్‌ రోడ్డు దళిత భూ నిర్వాసితుల డిమాండ్‌

- తాడూరు ఎస్‌ఐకి వినతి

తాడూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి-నంద్యాల వెళ్లే 167కే నూతన జాతీయ రహదారికి సంబంధించిన భూ నిర్వా సితులు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే బైపాస్‌ రోడ్డుకు సంబంధించి గతంలో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో మూడు అలైన్‌ మెంట్లను సర్వే చేశారు. ఇందులో పేద దళి తులు తక్కువ భూమి ఉన్న నిర్వాసితులు ఉండే తూర్పు దిశగా ఉన్న అలైన్‌మెంట్‌ను ఎంపి క చేసి పనులు చేపడుతామనడం సరికా దంటూ భూ నిర్వాసితులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక ఎస్‌ఐ గురుస్వామికి భూ నిర్వాసితులం దరూ వినతిపత్రం అందజేశారు. బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వం మాకు భూమికి భూమి తప్పని సరిగా ఇవ్వాలని కోరారు. లేని యెడల అలైన్‌మెంట్‌ మార్చాలని వారు కోరారు. డిపార్ట్‌మెంట్‌ మాపై కన్నెర్ర చేయకుండా మాకు సహకరించి మా భూ ములు 167కే జాతీయ రహదారికి మళ్లించ కుండా సహకరించాలని తాడూరు దళిత రైతులు వినతిలో విన్నవించుకున్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:16 PM