Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు
ABN , Publish Date - Jun 11 , 2024 | 05:26 PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆరుగురిని నిందితులుగా చేర్చారు. కాగా మార్చి 10న ఎఫ్ఐర్ నమోదు చేసిన పోలీసులు మొత్తం ఆరుగురిపై అభియోగాలు మోపారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆరుగురిని నిందితులుగా చేర్చారు. కాగా మార్చి 10న ఎఫ్ఐర్ నమోదు చేసిన పోలీసులు మొత్తం ఆరుగురిపై అభియోగాలు మోపారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు. కాగా అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్‌లు దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్టు నిందితుల తరపున లాయర్లు వాదనలు వినిపించారు. ఈ కేసులోసాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు.
చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ కేసును ఇంకా విచారించాల్సింది చాలా ఉందని, కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దన్న పీపీ వాదించారు. కాగా ఇరువురి బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. బెయిల్ పిటిషన్లపై తీర్పును నాంపల్లి కోర్టు (బుధవారం) ప్రకటించనుంది.