Share News

తాగునీటి కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:36 AM

విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో పురోగతి సాధిస్తున్న మిర్యాలగూడ పట్టణంలోని జనాభా రోజురోజుకూ పెరుగుతోంది.

 తాగునీటి కష్టాలకు చెక్‌
పట్టణంలోని పదో వార్డులో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు (ఫైల్‌ ఫొటో)

తాగునీటి కష్టాలకు చెక్‌

ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు

రూ.93.40 కోట్లతో పథకం

ప్రారంభమైన పనులు

మిర్యాలగూడటౌన, డిసెంబరు 2(ఆంధ్రజ్యో తి): విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో పురోగతి సాధిస్తున్న మిర్యాలగూడ పట్టణంలోని జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో శివారు కాలనీతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలను తా గునీటి సమస్య వేధిస్తోంది. పట్టణ సమీపంలోని అవంతీపురం మిషన భగీరథ ప్రాజెక్టు ద్వారా 10 మిలియన లీటర్ల నీరు సరఫరా చేయాల్సి ఉండ గా ప్రస్తుతం ఆరు మిలియన లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమ స్య ఉంది. ఈ నేపథ్యంలో ‘పానీ’పట్టు యుద్థాలకు చరమగీతం పాడేందుకు అధికారులు చర్యలు చేపట్టగా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి కృష్ణా రిజర్వాయర్‌ నుంచి మంచినీటి పథకం-1 ద్వారా ప్రస్తుతం నీటి సరఫ రా జరుగుతుండగా మరో పథకానికి పనులు ప్రారంభించారు అధికారులు. రూ.93.40కోట్ల వ్య యంతో మరో తాగునీటి పథకం రూపొందింది. అమృత నిధులతో చేపట్టిన తాగునీటి పథకం-2 పనులను అధికారులు ఇటీవల ప్రారంభించారు. కృష్ణా మంచినీటి పథకం -1 పది మిలియన లీట ర్ల సామర్థ్యంతో ఉండగా, తాజాగా ప్రారంభించిన రెండో పథకం 20 మిలియన లీటర్ల సామర్థ్యంతో రూపొందించి నట్లు అధికారులు తెలిపారు.

శాశ్వత పరిష్కారం కోసం....

మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. ఇక ప్రకా్‌షనగర్‌, తాళ్లగడ్డ, రవీంద్రనగర్‌ తదితర ప్రాంతాల కు తాగునీరు సరఫరా కావడం లేదని ఆయా కాలనీల ప్రజలు తరచూ మునిసిపల్‌ అధికారులు ఫిర్యా దు చేస్తున్నారు. తాగునీటి కోసం సుదూరం రా వాల్సి వస్తోందని, సమయమంతా వృథా అవుతోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మరో మంచినీటి పథకానికి చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాగునీటి సరఫరా జరిగేదిలా...

మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డుల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన పథకం -2 ప్రాజెక్టు ద్వారా తాగునీరు పట్టణమంతా సరఫరా కానుంది. పట్టణంలోని హౌజింగ్‌బోర్డు, ఇందిరమ్మ కాలనీ, ట్యాంకుతండా, షాబూనగర్‌, నందిపా డు తదితర కాలనీల్లో 11 ఉపరితల ట్యాంకులు, నూతన ఫిల్టర్‌ బెడ్‌ (20 ఎంఎల్‌డీ) నిర్మించనున్నారు. ప్రాంతాల వారీగా 4 నుంచి 10 ల క్షల కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మించే ట్యాంకులకు స్థల పరిశీలిన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తీవ్రంగా మంచినీటి కొరత

పట్టణంలోని శివారు ప్రాంతా ల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. బిందెడు మంచినీటి కోసం మ హిళలు చాలా దూరం వెళ్లాల్సి వ స్తోంది. తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రైల్వేస్టేషన రహదారిలో ఖాళీ బిం దెలతో నిరసన వ్యక్తం చేశాం. మునిసిపాలిటీ లో వినతిపత్రాలు సమర్పించాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన ప్రాజెక్టు రూపొందించాలి. త్వరిత గతిన పనులు పూర్తి చేయాలి.

బావండ్ల పాండు, సీపీఎం పట్టణ కార్యదర్శి

పనులు ప్రారంభించాం

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాం. రూ.93.40కోట్ల నిధులతో మరో మంచినీటి పథకాన్ని ప్రారంభించాం. ప్రాజెక్టుకు సంబంధించి అమృత, పబ్లిక్‌ హెల్త్‌ శాఖలు ఇప్పటికే పనులు మొదలుపెట్టాయి. భవిష్యత్తులో పట్టణంలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని అంచనాలు రూపొందించాం. ప్రాజెక్టు పనులు పూర్తయితే మూడు దశాబ్దాల వరకూ పట్టణంలో తాగు నీటికొరత ఉండదు.

ఎండీ యూసుఫ్‌, కమిషనర్‌

Updated Date - Dec 03 , 2024 | 12:36 AM