అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:46 AM
జగిత్యాల జిల్లాలో బుధవారం క్రిస్‌మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల పట్టణంలోని మిషన్ కాంపౌండ్‌లో ఉన్న సీఎస్‌ఐ చర్చితో పాటు గోవిందుపల్లెలోని ఏసురత్నం చర్చి, హౌసింగ్ బోర్డులో ఉన్న క్రైస్ట్ చర్చిలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో పాటు కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రార్థనలు ని ర్వహించారు.
జగిత్యాల క్రైం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) :జగిత్యాల జిల్లాలో బుధవారం క్రిస్‌మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల పట్టణంలోని మిషన్ కాంపౌండ్‌లో ఉన్న సీఎస్‌ఐ చర్చితో పాటు గోవిందుపల్లెలోని ఏసురత్నం చర్చి, హౌసింగ్ బోర్డులో ఉన్న క్రైస్ట్ చర్చిలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో పాటు కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రార్థనలు ని ర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ధర్మపురి: మండలంలోని పలు ప్రార్థనా మంది రా ల్లో క్రైస్తవులు ప్రార్థనలు జరిపారు. కేక్ కట్ చేసి పం పిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్‌లు దాసం డ్ల శాంతికుమార్, సైమన్, దేవయ్య, నాథానియల్, జా న్‌వెస్లీ, డానియల్, సన్నీ పాల్గొన్నారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ క్రైస్తవులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తె లిపారు. టీపీసీసీ సభ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్, ఉపాధ్యక్షులు రాజేష్ పాల్గొన్నారు.
కోరుట్ల: పట్టణంలోని వివిధ కాలనీలలో ఉన్న చర్చ్ లలో మంగళవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. చర్చిల్లో క్రైస్మవులు పార్థనలను జరిపి వేడు లను నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రార్థన స్థ లాలలో జరిగిన వేడులలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణా రావు శుభాక్షాంక్షలు తెలిపారు.
వెల్గటూర్: మండలంలోని వివిధ చర్చిలలో ఫాదర్ లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శు భాకాంక్షలు తెలుపుకున్నారు.
బీర్‌పూర్: మండలంలోని పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్‌లు కట్‌చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. చెర్చ్ ఫాధర్లు పౌలు, జోషప్, అబ్రహం, రవి, జోసఫ్ పాల్గొన్నారు.
మల్యాల: మల్యాల మండలంలో క్రిస్‌మస్ వేడుక లు ఘనంగా జరిగాయి. క్రిష్టియన్లు ప్రార్థనలు చేయ గా పలు గ్రామాల్లోని చర్చిలలో కేక్ కట్ చేశారు. ఫా స్టర్ వినయ్‌సాగర్, క్రిష్టియన్ సోదరులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.