Share News

CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్

ABN , Publish Date - Oct 15 , 2024 | 02:48 PM

రాజకీయాలకతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద రాడార్ స్టేషన్ గా పూడూరు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రం నిలుస్తుందని సీఎం అన్నారు.

CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్

వికారాబాద్: రాజకీయాలకతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద రాడార్ స్టేషన్ గా పూడూరు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రం నిలుస్తుందని సీఎం అన్నారు. వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో భారత నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాడార్ స్టేషన్ కు భూమిపూజ చేసిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ భాగస్వామ్యం కీలకమన్నారు.


"హైదరాబాద్ దేశ రక్షణకు సంబంధించి కీలకమైన నగరం. తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉంది. ఇక్కడ వీఎల్ఎఫ్ నిర్మాణంతో సముద్ర ప్రాంతం నుంచి చొరబడే ముష్కరుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ స్టేషన్ తో అనర్థాలు జరుగుతాయని కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేశారు. కానీ తమిళనాడులో 34 ఏళ్లుగా ఉంది. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దేశ రక్షణ కోసం రాజీపడొద్దనే  ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు.  దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయం. కేంద్రంతో కలిసి నడుస్తాం. దేశ రక్షణ కోసం పెడుతున్న ప్రాజెక్టులపై రాజకీయం చేసేవారు పునరాలోచించుకోవాలి . రాడార్ స్టేషన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది.  దేశభద్రత చాలా ముఖ్యం. రాడార్ స్టేషన్ పై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. దేశ రక్షణకు సంబంధించిన విషయాన్ని కూడా రాజకీయం చేయడం తగదు. బీఆర్ఎస్ పదేళ్లు అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించిన అంశంలో కూడా బీఆర్ఎస్ నేతలు అవే అబద్దాలు చెబుతున్నారు" అని సీఎం రేవంత్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 03:08 PM