Share News

TG Politics : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ABN , Publish Date - Nov 06 , 2024 | 08:08 PM

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేటి నుంచి ప్రారంభమవుతున్న కులగుణన కార్యక్రమాన్ని ఆయనకు వివరించారు. దేశంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణనే అని గవర్నర్‌కు సీఎం తెలిపారు.

TG Politics : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్, నవంబర్ 06: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా గవర్నర్ వర్మకు ఆయన తెలిపారు. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచేలా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భేటీలో సీఎం రేవంత్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీతోపాటు ఎంపీలు బలరాం నాయక్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజ్‌‌భవన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె వివాహం జరగనుంది. ఈ వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు తెలుస్తుంది.

Also Read: YCP Ex MLA: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ దాడులు

Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు


కుల గణన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బుధవారం చేపట్టింది. కులగణన చేస్తే ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారు. ఎవరు పేదలు, ఎవరికి ఆస్తులు ఉన్నాయనే అంశం తెలుస్తుంది. నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెలాఖరుతో ముగియనుంది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సైతం ఈ కుల గణన అంశాన్ని ప్రస్తావించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో కులగణన కార్యక్రమం చేపడతామని ఆ పార్టీ ప్రచారస్త్రంగా వాడుకుంది.

Also Read: Thinmar Mallanna: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

Also Read: సబ్జా గింజలతో ఇన్ని లాభాలున్నాయా..?


దీంతో ఆ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. అందులోభాగంగా కులగణనను రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టింది. ఇంకోవైపు కులగణన ప్రారంభానికి ముందు రోజో.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా కులగణన అంశంపై బోయనపల్లిలో కాంగ్రెస్ కీలక నేతల సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కులగణనకు సంబంధించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: karthika Masam 2024: కార్తీక మాసంలో పాటించ వలసిన నియమాలు.. పఠించ వలసిన స్తోత్రాలు

Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు వెల్లువెత్తిన అభినందనలు


ఈ కులగణన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలు ఒక పూట మాత్రమే పని చేస్తాయి. రెండో పూట పాఠశాల సిబ్బంది ఈ కులగణన కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

For Telangana News And Telugu News..

Updated Date - Nov 06 , 2024 | 08:50 PM