CM Revanth reddy: ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
ABN , Publish Date - Sep 22 , 2024 | 09:35 PM
కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. జాగ్రత్తగా మెలగాలని వారికి సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు.
Damodar Valley Corporation: ప్రధాని మోదీకి సీఎం మమతా బెనర్జీ మళ్లీ లేఖ
ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సమయం కేటాయించాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. బీసీ జనగణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్డు ఆధారంగానే ఆ ఫ్యామిలీకి సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.
Also Read: Balineni: జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు
ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొట్టే విధంగా సన్నద్దంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సీఎల్పీ సమావేశంలో పీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బి. మహేశ్ కుమార్ గౌడ్‌ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.
Also Read: Flight Makes Emergency Landing: విమానంలో ఎలుక... అత్యవసరంగా ల్యాండింగ్..
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, కడియం శ్రీహరి, దానం నాగేందర్, ప్రకాశ్ గౌడ్ తదితరులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: Viral Video: భారత్‌లో సరే.. చైనాలో జనరల్ రైలు బోగీలో ప్రయాణం ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా?
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతు వస్తున్నారు. అలాంటి వేళ.. పీసీీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో బీసీ వర్గానికి చెందిన బి. మహేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.
Also Read: Rail Track: రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు.. తృటిలో తప్పిన రైలు ప్రమాదం
దాంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఇటీవల బాధ్యతలు చేపట్టారు. అయితే కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం అనంతరం సీఎల్పీ సమావేశం జరగడం చాలా కాలంగా ఓ అనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2021లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీని ఆయన ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను సైతం ఆయన తన వాగ్దాటితో వివిధ సభల్లో ఎండగట్టారు. ఆ క్రమంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి.. బీఆర్ఎస్‌ను ప్రతిపక్షానికి పరిమితం చేసిన విషయం విధితమే.
Also Read: YS Jagan: పీఎస్‌లో వైఎస్ జగన్‌పై ఫిర్యాదు
For More AndhraPradesh News And Telugu News..