Share News

Konda Surekha: మంత్రి సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Nov 22 , 2024 | 02:50 AM

మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ కోర్టులో గురువారం విచారణ జరిగింది.

Konda Surekha: మంత్రి సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోండి

  • నాంపల్లి కోర్టులో నాగార్జున న్యాయవాది వాదనలు

హైదరాబాద్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ కోర్టులో గురువారం విచారణ జరిగింది. నాగార్జున తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయింది. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. సురేఖ న్యాయవాది గుర్మిత్‌ సింగ్‌ ప్రతివాదన చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. కేటీఆర్‌ వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారనే కోణంలో సమంతను ఉదాహరించారు తప్ప మరో ఉద్దేశం లేదని తెలిపారు. అయినా, పిటిషనర్‌ నాగార్జున వేరొకరి తరఫున దావా వేశారని, సురేఖ వ్యాఖ్యలతో ఆయన పరువుకు భంగం కలగలేదని తెలిపారు.

Updated Date - Nov 22 , 2024 | 02:50 AM