Share News

LK Advani: జైల్లో ఉండాల్సిన అద్వాణీకి భారతరత్న ఇవ్వడం ఏంటి?

ABN , Publish Date - Feb 04 , 2024 | 07:00 PM

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. జైల్లో ఉండాల్సిన ఆయనకు భారతరత్న ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం కోసం 1990లో అద్వాణీ చేపట్టిన రథయాత్ర దేశంలో మతకల్లోహాలు సృష్టించిందని విమర్శించారు.

LK Advani: జైల్లో ఉండాల్సిన అద్వాణీకి భారతరత్న ఇవ్వడం ఏంటి?

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. జైల్లో ఉండాల్సిన ఆయనకు భారతరత్న ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం కోసం 1990లో అద్వాణీ చేపట్టిన రథయాత్ర దేశంలో మతకల్లోహాలు సృష్టించిందని విమర్శించారు. ఆ ఘర్షణల్లో ఎందరో ప్రాణాలు కోల్పోవడంతో వందలాది మంది గాయాలపాలయ్యారని గుర్తు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో అడ్వాణీ ముద్దాయిగా కూడా ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ప్రకటించి, దేశానికి కేంద్ర ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు.


ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో పోటీ చేయడం సరైంది కాదని నారాయణ అభిప్రాయపడ్డారు. రాహుల్ పోటీ చేసేందుకు దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయని.. ఇండియా కూటమిలో ఉన్న పార్టీల స్థానాల్లో ఆయన పోటీ చేయాలనుకోవడం మంచిది కాదని హితవు పలికారు. ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. ఇక త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ దేశవ్యాప్తంగా 30 నుంచి 35 స్థానాల్లో పోటీ చేస్తుందని వివరణ ఇచ్చారు. అటు.. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే, దేశానికి విపత్తు వచ్చినట్టేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా కూడా ఆరోపణలు చేశారు.

Updated Date - Feb 04 , 2024 | 07:00 PM