Home » LK Advani
అడ్వాణీ డిసెంబర్ 12వ తేదీ నుంచి వయో సంబంధిత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టడంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.
బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్‌కెే అద్వానీ శనివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని మధుర రోడ్డులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
బీజేపీ అగ్రనేత అయిన ఎల్‌కే అడ్వాణి 1927 నవంబర్ 8న జన్మించారు. 1942 వలంటీర్‌గా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. 1986 నుంచి 1990 వరకూ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకూ కూడా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
అదానీకి మంజూరు చేసిన ప్రాజెక్టుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని విమర్శించిన ఓ ఎన్జీవోకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది.
మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ(delhi)లోని ఎయిమ్స్(aiims)లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు.
కేంద్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకునేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. అనంతరం మోదీ.. బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్ కె అద్వానీ నివాసానికి వెళ్లారు. ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి నివాసానికి మోదీ వెళ్లారు.
భారతీయ జనతా పార్టీ కేవలం ప్రతిపక్ష నేతలనే కాదు.. సొంత పార్టీ నేతలను కూడా జైల్లో పెడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ మిషన్‌ని..
దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణికి ప్రదానం చేస్తున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుచుని ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూర్చుని ఉండటంపై జార్ఖాండ్ ముక్తి మోర్చా ఆక్షేపణ తెలిపింది. ఆమె గిరిజన మహిళ అయినందునే రాష్ట్రపతిని ప్రధాని అవమానించారని విమర్శించింది.
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ''భారత రత్న'' ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం ఉదయం స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేశారు.