పంట పశువుల పాలు..
ABN , Publish Date - Apr 29 , 2024 | 11:59 PM
యాచారం మండలం కుర్మిద్దతండాలో భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో చేతికందే దశలో పంటలు ఎండుతున్నాయి.
యాచారం, ఏప్రిల్ 29 : యాచారం మండలం కుర్మిద్దతండాలో భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో చేతికందే దశలో పంటలు ఎండుతున్నాయి. వేల రూపాయల అప్పులు తెచ్చి సాగు చేసిన రైతులు ఎండిన పంటను చూసి గుండెలు బాదుకుంటున్నారు. చివరకు చేసేది లేక ఎండిన పంటను పశువులకు మేతగా వాడుకుంటున్నారు. ఇదే తండాకు చెందిన జగన్ నాయక్ ఎకరం పొలంలో రూ.45 వేల అప్పు చేసి వరి పంట వేశాడు. తీరా పంట ఈనుతున్న దశలో బోర్ ఎండిపోవడంతో ఈనుతున్న వరి పంట నిలువునా ఎండిపోయింది. దీంతో వరి పంటను పాడిపశువులను మేపుతున్నారు. బోర్ ఎండిపోవడంతో పంట ఎండి అప్పులు మిగిలాయని బాధిత రైతు ఆందోళన వ్యక్తం చేశాడు.