ధర్మపురి క్షేత్రంలో భక్తుల సందడి
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:47 AM
ధర్మపురి క్షేత్రంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. మార్గశిర మాసం సందర్భంగా క్షేత్రానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. స్థానిక లక్ష్మీ నృసింహ స్వామి, అనుబంధ రామలింగేశ్వ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది.
ధర్మపురి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. మార్గశిర మాసం సందర్భంగా క్షేత్రానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. స్థానిక లక్ష్మీ నృసింహ స్వామి, అనుబంధ రామలింగేశ్వ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. గోదావరి నదిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించారు. నరసింహుడి ఆలయంలో భక్తులు అభిషేకాది పూజలు, కుంకుమార్చన, స్వామి వారల నిత్య కళ్యాణం జరిపించి పూజలు చేశారు. యమ ధర్మరాజు ఆలయం వద్ద గండ దీపంలో నూనె పోసి భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు. స్వామి వారలకు ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, వేద పారాయణదారు పాలెపు ప్రవీణ్‌కుమార్‌శర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య నిత్య పూజలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది తగు సేవలు అందించారు.
స్వామి వారిని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు ఆమెను ఆశీర్వదిం, స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు.