నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా దాసరి హరిచందన
ABN , Publish Date - Jan 04 , 2024 | 12:10 AM
నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా దాసరి హరిచందనను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నల్లగొండ, జనవరి 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి):నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా దాసరి హరిచందనను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన కలెక్టర్ ఆర్‌వీ కర్ణనను ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా బదిలీ కాగా, ఆయన స్థానంలో ఇనచార్జి కలెక్టర్‌గా హేమంత కేశవ్‌పాటిల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాసరి హరిచందన 2010 ఐఏఎస్ బ్యాచ ఆఫీసర్. ఆమె జీహెచఎంసీలో వెస్ట్‌జోనల్ కమిషనర్‌గా, సీఎ్‌సఆర్(కార్పొరేట్ సామాజిక బాధ్యత) అడిషనల్ కమిషనర్‌గా, ఆయూష్ డైరెక్టర్‌గా, నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశలోని విజయవాడలో కొంతకాలం పాటు ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మునిసిపల్ శాఖ డీఎంగా, ప్రజావాణీ స్పెషల్‌ఆఫీసర్‌గా కొనసాగుతున్న హరిచందనను రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఇటీవలే జిల్లా ఎస్పీగా చందనా దీప్తి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారులు మహిళలు కావడం విశేషం. దాసరి హరిచందన బ్రిటీషు కౌన్సిల్ అవార్డును 2021 సంవత్సరంలో అందుకున్నారు. భారతదేశంలో ప్రజాసేవ చేసిన యంగ్ డైనమిక్ ఆఫీసర్లలో ఆమె పేరును బ్రిటీష్ ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశంలో ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక ఆఫీసర్ ఈమె ఒక్కరే.